మిరప పంటలపై బిటి ప్రయోగం

గుంటూరు,నవంబర్‌22: బిటీ వంగలాంటిదే ఇప్పుడు గుంటూరులో మిర్చిని తయారు చేసే పరిశోధనలు ఊపందుకున్నాయి. వీటిని ఇలాగే కొనసాగిస్తే మన మిర్చి మనకు దక్కదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  సరిగ్గా నాలుగైదేళ్ల తరువాత అదే తరహాలో మొక్కల్లో హార్మోన్లు వేగంగా పెరగానికి జిబ్బర్‌లిక్‌ యాసిడ్‌ను ఉపయోగించారు. ఆహార పదార్థాలైన మిర్చిపై దీనిని ప్రయోగించడం ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించదని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ధ్రువీకరించటం లేదు.  వివిధ రకాల మొక్కలపై ఇది గ్రోత్‌ ప్రమోటర్‌గా ఉపయోగపడుతుందన్నారు. ప్రమాదకరమైన మందులను చల్లి ఆహార ఉత్పత్తులను కలుషితం చేసి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ప్రయోగాలను అరికట్టాలంటే ఆ రెండు శాఖల అధికారులు, ఉద్యోగులను జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ కట్టడి చేయాలని రైతులు కోరుతున్నారు. ఆహార ఉత్పత్తులపై బీటీ ప్రయోగాలు చేయటం హాని కరమని కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలు దీనిని వెలుగులోకి తెచ్చారు. నీలం తుపానుతో మిర్చి పంట పూర్తిగా దెబ్బతింది. ఇప్పటి వరకు ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరక మిర్చికి ఖర్చు చేశారు. ఇంత డబ్బు పెట్టిన తరువాత కురిసిన వర్షాలకు మొక్కలు ఉరకేసి వడబడి పోయాయి. ఈ మొక్కలు వెంటనే జీవం పోసుకుని కళకళలాడాలంటే జిబ్బర్‌లిక్‌ యాసిడ్‌ను ఉపయోగించాలని విత్తన కంపెనీ ప్రతినిధులు ప్రచారం చేశారు. దీంతోపాటు- గతంలో ఈ ప్రాంతంలో ఈ మందు వాడిన రైతులు మంచి ఫలితాలు పొందినట్లు- చెప్పారు.  ఇంత జరుగుతున్నా రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన  వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు పత్తాలేరు. ఈ విభాగం ఎరువులు, పురుగు మందుల షాపుల వద్ద తిష్ఠ వేసి అందినకాడికి దండుకుని మిన్నకుంటున్నారు.  సలహాలకు అనుగుణంగా ఈపూరు, బొల్లాపల్లి, వెల్దుర్తి, కారంపూడి, దుర్గి తదితర మండలాల్లో వివిధ రకాల పంటలు ఏపుగా పెరిగి బాగా కాపు రావడానికి జిబ్బర్‌లిక్‌ యాసిడ్‌ అనే గ్రోత్‌ ప్రమోటర్‌ మందును రైతులు ఉపయోగిస్తున్నారు.   జీవం కోల్పోయిన మిర్చి మొక్కలను రక్షించుకోవడానికి రైతులు పిడుగురాళ్ల, కారంపూడి తదితర ప్రాంతాల నుంచి గ్రోత్‌ ప్రమోటర్‌గా ఉపమోగపడే ఎ/-లాంట్‌ హార్మోన్స్‌ మందు కోసం ఎగబడ్డారు. రైతుల ఒత్తిడిని కొన్ని కంపెనీలు క్యాష్‌ చేసుకున్నాయి. వాణిజ్య పంటలైన పసుపు, మిర్చి, పత్తి, పొగాకులకు దేశంలో గుంటూరు రాజధానిగా ఉంది. దీనికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి.