మీడియాపై నిర్బంధం ప్రజాస్వామ్యానికే పెనుముప్పు: టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు మధు గౌడ్

మీడియాపై నిర్బంధం ప్రజాస్వామ్యానికే పెనుముప్పు: టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు మధు గౌడ్

వనపర్తి బ్యూరో అక్టోబర్02 (జనంసాక్షి)

మీడియా నిర్బంధం, అణచివేత భారతదేశ ప్రజాస్వామ్యానికే పెనుముప్పని టి యు డబ్ల్యూ జే( ఐజే యూ) జిల్లా అధ్యక్షులు గుండ్రాతి మధు గౌడ్ హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వనపర్తి రాజీవ్ చౌక్ లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా శాంతియుత నిరసన చేపట్టారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. మాధవరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో మీడియాను రక్షించుకోవలసిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మీడియా రక్షణ చట్టాన్ని తేవాలని, కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపిన మీడియాను అణచివేస్తున్నారని కొందరు జర్నలిస్టులం హత్యకు గురి కాగా, మాఫియాబెదిరింపులు, దాడులు, అరెస్టులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాఫియా,అక్రమార్కులపై రాస్తే జర్నలిస్టులు దాడులు, ప్రాణ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు పాలకులు, అటు మాఫియా, అక్రమార్కుల మధ్య మీడియా పాత్ర ప్రమాదంలో పడిందని, మీడియా రక్షణ చట్టం తేవాలని, కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మీడియా విస్ఫోటనం నేపథ్యంలో మీడియాను రక్షించుకోవాల్సిన కర్తవ్యం ప్రతి పౌరుడు తీసుకోవాలన్నారు. మీడియా, జర్నలిస్టులకు పాలకులు, ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో మీడియాకు రక్షణ కరవైతే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని ప్రశ్నించారు. వాస్తవాలు బయటకు రాకపోతే సమాజం ఎంతో నష్టపోతుందని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత లేదని, సేవా భావంతో సమాజం ప్రజల కోసం శ్రమిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు, ఇండ్లు, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ భద్రత, విధుల్లో రక్షణ కల్పించాలన్నారు. 2021లో కరోనా నుంచి జర్నలిస్టులకు 50 శాతం రైతు పై రైల్వే పాసులను ఇవ్వటం లేదని పునరుద్ధరించాలని కోరారు. సోషల్ మీడియా కు బాగా ఆదరణ పెరిగిందని డిజిటల్ మీడియా ప్రాధాన్యత సంతరించుకున్నదని అయితే ఆశ వార్తల్లో విశ్వసనీయత ప్రజా ప్రయోజనాలు గీటురాయిగా ఉండాలన్నారు. సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు ఐక్యంగా పోరాడాలని కోరారు.యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. మాధవరావు, జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు మల్యాల బాలస్వామి, సీనియర్ జర్నలిస్ట్ ఊషన్న, స్టాపర్ రాజు, ఉమ్మడి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు కొండన్న యాదవ్, టౌన్ ప్రధాన కార్యదర్శి మన్యం, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు నవీన్, ఉర్దూ పత్రిక రిపోర్టర్ కమల్ తదితరులు మాట్లాడారు. అనంతరం గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శివ,జిల్లా ఉపాధ్యక్షుడు యాకుబ్ ,సీనియర్ జర్నలిస్ట్ పౌర్ణ రెడ్డి, జర్నలిస్టులు,గోపాల్,బాబు, విష్ణు, శ్రీకాంత్,విజయ్ కుమార్, సి.అంజి, కుమార్,వహిద్,మోహన్ బాబు, నరసింహ రాజు,సురేష్,శేఖర్,చిన్న,శివశంకర్,రాజు,ఫరూక్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.