ముంపుపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
విజయవాడ: ముంపు ప్రాంతాల ఏరియల్ సర్వేకు బయలుదేరిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గన్నవరం చేరుకున్నారు. అక్కడ ముంపు ప్రాంతాల తీవ్రతపై అధికకారులతో సమీక్ష జరిపారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని ఆయన తెలియజేశారు. బుడమేరుపై హైపవర్ కమిటీ వేశామని దానికి శాస్వత పరిష్కార మార్గం చూపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కౌలు రైతుల అప్పుల రద్దు విషయం ఆలోచిస్తామన్నారు. అనంతరం సీఎం వరద ప్రాంతాల ఏరియల్ సర్వేకు బయలుదేరారు.



