ముక్తార్ భాష మూడవ వర్ధంతి సభను జయప్రదం చేయండి

ముక్తార్ భాష మూడవ వర్ధంతి సభను జయప్ర 

ఖానాపురం సెప్టెంబర్ 29(జనం సాక్షి )

సిపిఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు ఐఎఫ్టియుజాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.కె ముక్తార్ పాషా మూడో వర్ధంతి సభలను సెప్టెంబరు24 నుండి30వరకు గ్రామ గ్రామాన నిర్వహించాలని సిపిఐ ( ఎం ఎల్ ) న్యూడెమోక్రసీ నర్సంపేట డివిజన్ కమిటీ పిలుపు నిచ్చారు. అందులో భాగంగా శుక్రవారం ఖానాపురం మండల కేంద్రంలోని గోదాంలో ఎస్.కె ముక్తార్ పాషావర్ధంతి పిలుపు పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగాఐఎఫ్టియునర్సంపేట ఏరియా అధ్యక్ష కార్యదర్శులు బరిగల కుమారు ఏషబోయిన ఐలయ్య కొత్తూరు రవి.మాట్లాడుతూ చదువుకునే రోజుల్లో పి డి ఎస్ యు ఉద్యమాల ద్వారా రాజకీయ చైతన్యం పొంది అంచలంచలుగా ఎదిగి సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులుగా, భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ అనారోగ్య కారణాల రీత్యా మరణించారని, నమ్ముకున్న రాజకీయాలకోసం 40 సంవత్సరాల పాటు విప్లవమే శ్వాసగా ఆశగా జీవించాడని, ప్రతిఘటనా పోరాట వారసత్వాన్ని కొనసాగించాడని అన్నారు. ఖమ్మం వరంగల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతాలలో బలమైన ప్రజాఉద్యమాలు నిర్మించాడని,కార్మిక కర్షక, ఆదివాసీల సమస్యలపై అలుపెరుగని పోరాటం నిర్వహించాడన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన అనేక ప్రజా ఉద్యమ కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషించాడని అన్నారు.సెప్టెంబరు 24న అల్లిగూడెంలో పాషన్న మూడవ వర్ధంతి సందర్భంగా జరిగే సభలో ప్రజలు అధికసంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. పాషన్న 3వ వర్ధంతి సభలను గ్రామ గ్రామాన జరపాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ డివిజన్ అధ్యక్షులు గట్టి కృష్ణ, పి వై ఎల్ జిల్లా నాయకులు బిక్షపతి, ఐఎఫ్టియు
నాయకులు రాజు, గద్దల శీను,అశోక్, కాడ శేఖర్,బిక్షపతి, రవీందర్, రమేష్, జినుకల యాకాంబరం,పి యాకాంబరం, నరేష్, లింగయ్య,తదితరులు పాల్గొన్నారు.