ముగిసిన తిరుమల బ్ర¬్మత్సవాలు
వైభవంగా శ్రీవారి చక్రస్నానం
తిరుమల,అక్టోబర్19(జనంసాక్షి): తిరుమలేశుని నవరాత్రి బ్ర¬్మత్సవాఉ ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం వేకువ జామున శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవీ, భూదేవీ సమేత మళయప్ప స్వామివారు వరాహ పుష్కరిణి చెంతకు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ ఉత్సవమూర్తులకు, చక్రతాళ్వారుకు అభిషేకాలు, స్నపన తిరుమంజనాన్ని అర్చకులు వేడుకగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ పెద్దజీయార్ సమక్షంలో అర్చకులు చక్ర తాళ్వారుకు పుష్కర స్నానం చేయించారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణలతో పుణ్య స్నానాలను ఆచరించి తన్మయత్నానికి లోనయ్యారు.
తిరుమలలో కొనసాగుతున్న రద్దీతిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కంపార్టుమెంట్లు నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. దీంతో శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం, టైంస్లాట్ సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నేడు తిరుమలలో పార్వేటి ఉత్సవం ఉంది. సుప్రభాతం మినహా అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.