ముగ్గురు భారతీయుల హత్య, ఆస్ట్రేలియన్‌కు 35 ఏళ్ల జైలు శిక్ష
ఆస్ట్రేలియా;
ముగ్గురు భారతీయులను హత్య చేసిన ఓ ఆస్ట్రేలియన్‌కు 35 ఏళ్ల జైలు శిక్ష విధించారు. భారీతీయుల హత్య కసులో నిందితుడైన ఆస్ట్రేలియాకు చెందిన సిగ(42) అనే వ్యక్తికి క్వీన్స్‌ల్యాండ్ సుప్రీంకోర్టు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. క్వీన్స్‌ల్యాడ్ చరిత్రలోనే అత్యధిక సంవత్సరాలు జైలు శిక్ష విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక వెళ్తే..బ్రిస్బేన్‌లోని స్పా మైదానంలో నీలిమా సింగ్ (24), సోదరుడు గునాల్(18), సోదరి సిద్ది (12) అనే ముగ్గురు 2003వ సంవత్సరం హత్యకు గురయ్యారు. ఇందులో నీలిమా సింగ్ బాయ్‌ఫ్రెండ్ అయిన సిగ నీలిమను హత్య చేశాడు. ఈ హత్యలు సంచలనం సృష్టించాయి. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తులు సిగకు 35 ఏళ్ల కారాగార శిక్ష విధించారు.