ముజఫర్‌ పూర్‌ కేసులో మరోమారు సుప్రీం సీరియస్‌

మాజీమంత్రి ఆచూకీ లేదనడంపై పోలీసులకు అక్షింతలు

న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ ¬మ్‌ కేసులో బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. అయితే షెల్టర్‌ ¬మ్‌ కేసులో మాజీ మంత్రితో సంబంధం ఉన్న వ్యక్తులను ఎందుకు అరెస్టు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. వసతి గృహంలో ఉన్న సుమారు 20 మందికిపైగా విద్యార్థినులను రేప్‌ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ విద్యార్థిని మృతదేహాన్ని కూడా ఆ షెల్టర్‌ ¬మ్‌లో పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి కనిపించడం లేదా, అయితే ప్రభుత్వమే దానికి వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇవాళ పేర్కొన్నది. ఇద్దరు టాప్‌ పోలీసు ఆఫీసర్లు కోర్టు ముందుకు రావాలని సుప్రీం తన తీర్పులో ఆదేశించింది. మాజీ మంత్రి ఎక్కడున్నారో తెలియరని ఎలా చెబుతారని కోర్టు పోలీసుల్ని ప్రశ్నించింది. ఈ కేసులో తదుపరి విచారణ నవంబర్‌ 27వ తేదీన ఉంటుంది. ఈ కేసులో మాజీ మంత్రి మంజూ వర్మపై సుప్రీం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది.