ముదిరాజుల సంక్షేమమే ప్రధాన ఎజెండా

ముదిరాజుల సంక్షేమమే ప్రధాన ఎజెండా

నాగర్ కర్నూల్ ఆర్సీ అక్టోబర్04(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడవ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మత్స్య సహకార సంఘం తాళ్లపల్లి గ్రామానికి ఉచిత చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు బుధవారం అందించారు.ఈ చేప పిల్లలను గ్రామ సర్పంచి భాస్కర్ గౌడ్ సమక్షంలో చెరువులో వదలవడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమమే ప్రధాన ఎజెండగా పెట్టుకుని మత్స్యకారుల కుటుంబాలకు జీవనాధారంగా చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.అంతేకాకుండా మత్స్య సొసైటీల బలపితం కోసం”మత్స్య సమీకృత పథకం”క్రింద మొదటి విడతలో మస్య సంఘ సభ్యులకు అండగా నిలిచి రాష్ట్రవ్యాప్తంగా సబ్సిడీ ద్వారా లునాలు,బుల్లోరా,ఆటోలు,డీసీఎంలు,వాహనాలు,ఐస్ బాక్సులు,వలలు ,అందించడం జరిగిందని గుర్తు చేశారు.మత్స్య సమీకృత పథకం క్రింద అర్హులైన మత్స్యకారులకు రెండో విడతలో వలలు,లూనాలు,బులోరా,ఆటోలు,డీసీఎం,వాహనాలు,అందించుటకు ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని తెలిపారు.అనంతరం మత్స్య సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు మాధవొని.గజ్జల్లయ్య,మామిళ్ళ.శంకరయ్య మాట్లాడుతూ,మత్స్యకారుల కుటుంబాలకు చేయూతనిచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా(రుణపడి)నిలుస్తామని అన్నారు మరియు మత్స్య సొసైటీ కమిటీ హాల్ నిర్మించాలని మత్స్య సొసైటీలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని,1000కోట్లతో ముదిరాజ్ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని,తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.రానున్న స్థానిక ఎన్నికల్లో 60లక్షలకు పైగా ఉన్న ముదిరాజులకు జనాభా దామాషా ప్రకారం అవకాశం కల్పించాలని కోరారు.ముదిరాజులను బిసి-డి నుండి బీసీ-ఏ గ్రూపుకు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టుకు
అందించిందని సుప్రీంకోర్టు న్యాయవాది డిఎల్ పాండు ముదిరాజ్ సూచించడం జరిగిందన్నారు ఇది కొద్ది రోజుల్లోనే అమల్లోకి రానున్నది అని అన్నారు.ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్ష కార్యదర్శులు గజ్జలయ్య,శంకరయ్య,ఉపాధ్యక్షులు ఆంజనేయులు,డైరెక్టర్లు రాములు,శివ కమిటీ సభ్యులు నిరంజన్,లింగయ్య,దశరథం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.