మున్సిపల్‌ కార్మికుల అరెస్ట్‌ అక్రమం

తెనాలిలో స్టేషన్‌ ముందు ధర్నా
గుంటూరు,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు కొనసాగిస్తోన్న సమ్మెను ఆయా ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకుంటున్న తీరుపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. పలుచోట్ల ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించే ప్రయత్నాలు చేస్తుండగా.. కార్మికులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం తెనాలిలో ప్రత్యామ్నాయ కార్మికులను, మునిసిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు అడ్డుకున్నారు. 2 టౌన్‌ పోలీసులు 30 మంది మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. అరెస్ట్‌ చేసిన మునిసిపల్‌ కార్మికులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. సిఐటియు, సిపిఎం నాయకులు,
కార్యకర్తలు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు తెనాలి 2 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

తాజావార్తలు