మూడు మాసాల్లో సర్వే పూర్తి చేయండి
– కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం.
హైదరాబాద్,,ఆగష్టు 31,(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా భూమి రికార్డులు ప్రక్షాళన చేయాలని సంకల్పించామని, అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సక్రమంగా పనిచేసి, వచ్చే మూడు నెలల్లో రెవెన్యూ అధికారులు భూమి రికార్డుల ప్రక్షాళన చేపట్టాలని సిఎం కెసిఆర్ కలెక్టర్లకు సూచించారు. ఇదో బృహత్తర కార్యక్రమమని, దీనిని సక్సెస్ చేయాలని అన్నారు. ప్రగతి భవన్‌లో కలెక్టర్లు, జేసీలు, ఆర్టీఓలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. భూమి రికార్డుల ప్రక్షాళన, సరళీకరణపై సీఎం అధికారులతో చర్చించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఎకరాకు రెండు పంటల పెట్టుబడికి గాను ఏడాదికి రూ. 8వేలు పెట్టుబడి రైతుల బ్యాంకు అకౌంట్‌లో వేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రైతుల దగ్గర నుంచి వివిధ పనుల కోసం లక్షలాది ఎకరాల భూమి సేకరించి, రైల్వే లైన్లు, ప్రాజెక్టులు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, ఆస్పత్రులు, కాలువలు నిర్మించడానికి తీసుకునట్లు వెల్లడించారు. కానీ ఈ వివరాలు రికార్డుల్లో నమోదు కాలేదు. ఇంకా ఆ భూములు రైతుల వద్దే ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భూముల విషయంలో స్పష్టత రావాలన్నారు. ప్రస్తుత భూములు ఎక్కడ ఎలా ఉన్నాయన్నదే సర్వే ప్రధాన ఉద్దేశ్యమని సిఎం వివరించారు. భూమి రికార్డులు సరిగా లేకపోవడం అనేక వివాదాలు, ఘర్షణలకు దారి తీస్తోంది. ఇప్పటి వరకు అధికారులు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉండిపోయారు. రెవెన్యూ అధికారులు ప్రథమిక విదైన భూ నిర్వహణను నిర్లక్ష్యం చేయాల్సి వచ్చింది. రెవెన్యూ, వ్యవసాయ రికార్డుల్లో రైతుల భూముల వివరాలు వేర్వేరుగా ఉన్నాయి. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం వల్లే ఈ సమస్య తలెత్తింది. ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో తేల్చి భూమి హక్కులపై స్పష్టత ఇవ్వాలి. మొదటి దశలో వివాదం లేని భూముల విషయంలో స్పష్టత ఇవ్వాలి. రెండో దశలో కోర్టు వివాదంలోని భూములను గుర్తించాలి. కోర్టు తీర్పునకు లోబడి వాటిపై స్పష్టత ఇస్తాం. ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ తదితర భూముల వివరాలు నమోదు చేయాలని సూచించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. భూరికార్డుల ప్రక్షాళన విషయంలో గ్రౌండ్ లెవల్లో జరగాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు. పహాణీ పుస్తకాలల్లో సరళమైన భాష వాడాలని సీఎం చెప్తున్నారు. వీటితోపాటు రైతు సంఘాల ఏర్పాటువిూద కూడా కీలక సూచనలు చేయనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, రికార్డుల నిర్వహణ, పట్టాదారు పాస్ పుస్తకాల్లో మార్పులు, పహాణీల్లో సరళమైన భాష, రిజిస్ట్రేషన్లలో సంస్కరణలు ఇలా అన్ని విషయాలపై వారికి దిశానిర్‌ందేశం చేయనున్నారు. సమావేశంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు కమిటీ భూ సర్వే విూద ఇచ్చిన నివేదికపైనా చర్చ జరగనుంది. భూ సర్వే ఎన్ని రోజుల జరగాలి? ఎంత మందితో సర్వే చేయించాలి? కంప్యూటీకరణ ఎలా చేయాలి? ఇట్లాంటి అన్ని విషయాలపైన ముఖ్యమంత్రి కలెక్టర్లతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటారు. వీటితోపాటు రైతు సంఘాల ఏర్పాటువిూద కూడా కీలక సూచనలు చేయనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి నియామకం చేయాలనీ, సమితిలో 15 మంది, మండల, జిల్లా రైతు సమన్వయ సమితిల్లో 24 మంది, రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో 42 మందితో రైతులు ఉండేలా కమిటీల ఏర్పాటు చేయాలని గతంలోనే సీఎం చెప్పారు.



