మూడోదశ పోలింగ్‌కు భారీ భద్రత

శ్రీనగర్నవంబర్‌24(జ‌నంసాక్షి): జమ్మూ-కాశ్మీర్‌ పంచాయితీ ఎన్నికల మూడవ దశ పోలింగ్‌ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాశ్మీర్‌ డివిజన్లలో 918, జమ్మూ డివిజన్లలో 1,855 డివిజన్లలో సహా మొత్తం 2,773 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికలు మధ్యాహ్నం 2గంటలకు ముగయనున్నాయి. 727 పోలింగ్‌ కేంద్రాలను తీవ్రమైన పరిస్థితులు కలిగిన వాటిగా వర్గీకరించామని తెలిపారు. కాశ్మీర్‌ డివిజన్‌లో 493 ఉండగా, జమ్ము డివిజన్‌లో 234 ఉన్నాయి. మొత్తం 5,239 మంది అభ్యర్థులు ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. సర్పంచ్‌ నియోజకవర్గాల్లో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని, పంచాయతీల్లో రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. భద్రతా ఏర్పాట్లతో సహా అన్ని పూర్తి చేశామని తెలిపారు.