మృతుల కుటుంబ సభ్యులకు సింగిల్ విండో చైర్మెన్ పరామర్శ

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్మికుడు పైసా శ్రీకాంత్ తండ్రి దుర్గయ్య శనివారం అనారోగ్య కారణాల వలన మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను సింగిల్ విండో చైర్మెన్ బోలిశెట్టి శివయ్య ఆదివారం రోజు పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ సందర్భంగా వారి వెంట… జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చిత్తారి రవీందర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండీ హాసన్, కౌన్సిలర్స్ పున్న లావణ్య సది,వల్లపు రాజు,బత్తుల రవీందర్ మాజీ వార్డ్ మెంబర్ సావుల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.