మెక్సికో తీర ప్రాంతంలో భూకంపం
కాబోసాస్‌లుకాన్: మెక్సికోలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. దక్షిణ ప్రాంతమైన బజా కాలిఫోర్నియా తీర ప్రాంతంలో ఉన్న లాపాజ్ నగరంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదయ్యాయి. లాపాజ్‌కు 75 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలియజేశారు.