*మెట్పల్లి పట్టణంలో ఘనంగా గణనాథుల నిమజ్జన ఉత్సవం
మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 10
(జనం సాక్షి)
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో గణనాథుల నిమజ్జోనత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుచున్నది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు మెట్పల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్ పర్సన్ రానవేని సుజాత సత్యనారాయణ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య ,మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు పర్యవేక్షణలో నిమజ్జన ఉత్సవాల కార్యక్రమం ఘనంగా ,అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా , చూడముచ్చటగా జరుగుచున్నది డీఎస్పీ రవీందర్ రెడ్డి , సీఐ శ్రీనివాస్ ,ఎస్ఐ సధాకర్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు పగడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉన్నతాధికారులు ,ఎమ్మార్వో కార్యాలయ అధికారులు , పోలీసులు ఉన్నతాధికారులు , మరియు పోలీస్ సిబ్బంది , మున్సిపల్ సిబ్బంది ,అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు