: మెదక్ పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మాత నల్ల పోచమ్మ బోనాల ఉత్సవాలు…
మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):ఆషాడ మాసం పురస్కరించుకుని మెదక్ పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మాత నల్ల పోచమ్మ బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం మెదక్ పట్టణంలోని నవా పేట, పెద్ద బజార్, న్యూ మార్కెట్ పిట్లంబేస్, ఫతేనగర్, చమన్, గాంధీనగర్, దయరా, ఇందిరా కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, జమ్మికుంట, బ్రాహ్మణ వీధి, నర్సుఖేడ్, అజంపుర, కోలిగడ్డ,తో పాటు ఆయా వీధులకు చెందిన బోనాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తాలో బ్యాండ్ మేళాలు, డీజే సౌండ్ తో దద్దరిల్లింది. అనంతరం ఊరేగింపుగా వెళ్లి మాత నల్ల పోచమ్మ దేవాలయం వద్ద బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి హాజరై బోనాల్ ని ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, కాసాని వీరేష్ సైతం బోనాల ఉత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, నిజాం పేట ఎంపీపీ పంజా విజయ్ కుమార్, కౌన్సిలర్లు మామిళ్ల ఆంజనేయులు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్టి రాజు, పట్టణ అధ్యక్షులు బండ నరేందర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు నరేష్, జగన్, జీవన్, కార్తీక్, హరి, చైతన్య, సందీప్, గోపాల కృష్ణ, శేఖర్, విజయ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాల ఊరేగింపులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు పలువురిని అలరించాయి.

Attachments area



