మెరుగుపడుతున్న రూపాయి

ముంబై,(జనంసాక్షి): ఆర్‌బిఐ నిర్ణయంతో బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలు జరుపుతుండటంతో డాలర్‌తో పోలిస్తే రూపీ మారకం విలువ కాస్త పెరిగింది. ప్రస్తుతం 16 పైసలు పెరిగి 59.36 పైసలు వద్ద ట్రేడవుతుంది. ప్రభుత్వం రూపీ కంట్రోల్‌కు సంబందించి చర్యలు తీసుకుంటామని చెప్పడం,ఆర్‌బిఐ కూడా డాలర్ల విక్రయాలకు అనుమతించడం రూపీ విలువ కొంత పెరగటానికి కారణమయ్యాయి. ఫెడ్‌ రిజర్వ్‌ ప్రకటన తరువాత రూపీ జీవిత కాలపు కనిష్ట స్థాయికి పడిన విషయం తెలిసిందే.