మెరుగైన వైద్య సేవలకు కృషి చేస్తున్న ప్రభుత్వం

గడా అధికారి ముత్యంరెడ్డి, ఎంపీపీ అధ్యక్షులు మెరుగు బాలేశంగౌడ్

జగదేవ్ పూర్, జూలై  20 జనం సాక్షి: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని  సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అధికారి  ముత్యం రెడ్డి, జగదేవ్ పూర్ ఎంపీపీ అధ్యక్షులు మెరుగు బాలేశం గౌడ్ లు వెల్లడించారు. బుధవారం జగదేవ్ పూర్ మండలం పరిధిలోని తీగుల్, జగదేవ్ పూర్ లోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ఎంపీపీ అధ్యక్షులు మెరుగు బాలేశం గౌడ్ అధ్యక్షతన ఆసుపత్రుల అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్బంగా  జరిగిన సమావేశాల్లో వారు ప్రసంగిస్తూ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధుల పేరిట  గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి ఏటా  రూ. 87500లు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆసుపత్రి  అభివృద్ధి కమిటీల తీర్మానాల ద్వారా సంబంధిత నిధులతో  ఆస్పత్రుల్లోని  చిన్నచిన్న మరమ్మతులకు ఇతర సామాగ్రి కొనుగోలుకు వినియోగిస్తారని తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలంలో వల్ల వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల  వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వారు  సూచించారు. సమావేశాల్లో  డిప్యూటీ డిఎం అండ్ హెచ్వో శ్రీధర్, సిహెచ్ఓ రవీందర్ రెడ్డి, తీగుల్ సర్పంచ్ కప్పర భానుప్రకాశ్రావు, ఎంపీటీసీలు కవితా శ్రీనివాస్ రెడ్డి, మంజుల మహేందర్ రెడ్డి   వైద్యాధికారులు మహిపాల్, నివేదిత,  వైద్య సిబ్బంది నారాయణ, జితేందర్ రెడ్డి  ఏఎన్ఎంలు  తదితరులు పాల్గొన్నారు.