మేయర్ చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
నాచారం(జనంసాక్షి): మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలో శనివారం జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి , మంత్రివర్యులు చామకుర మల్లారెడ్డి , డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. డివిజన్ లోని తిరుమల నగర్ లో 14 లక్షల అంచనా విలువైన చైన్ లింక్ పెన్సింగ్ వర్క్, వెంకటేశ్వర నగర్ కాలనీలో 13లక్షల అంచనా విలువైన చైన్ లింక్ పెన్సింగ్ వర్క్, మంగాపురం కాలనీలో 40లక్షల అంచనా విలువైన సి సి రోడ్ వర్క్ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ మేయర్ గద్వాల విజయలక్ష్మి కి, మంత్రి మల్లారెడ్డి కి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరం అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయించి జిహెచ్ఎంసి పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. ఇక ముందు కూడా డివిజన్ లో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూనే, వాటితో పాటు ఏమైనా సమస్యలు ఉంటే ఒక్కొక్కటి గా తీర్చుకుంటూ ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ డివిజన్ అద్యక్షులు గుండారపు శ్రీనివాస్ రెడ్డి, ఏఈ రాకేశ్, డీఈ రూప, వర్క్ ఇన్స్పెక్టర్ చారి, ఎస్.ఎఫ్.ఏ ల తోపాటు పారిశుద్య కార్మికులు, కాలనీల సంక్షేమ సంఘ నాయకులు చారి, జయపాల్, నవీన్ గౌడ్, సాయి కుమార్, పూస రమేశ్, బాలయ్య, మల్లేశ్, యాదగిరి, రామకృష్ణా, శేఖర్, దండెం నరేందర్, మహిళా నాయకురాలు పర్వీన్, కృష్ణవేణి, భారతి, జ్యోతి, అలివేలు, కొమురమ్మ, శకుంతల తదితరులు పాల్గొన్నారు.
Attachments area