మైదానంలో యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌లు పెట్టుకోవద్దు

– పాక్‌ క్రికెటర్లకు ఐసీసీ ఆదేశాలు
లండన్‌, మే25(జ‌నంసాక్షి) : పాక్‌ క్రికెటర్లు ఎవరూ యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌లు పెట్టుకోవద్దని ఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్‌-ఇంగ్లాండ్‌ మధ్య లండన్‌ వేదికగా టెస్టు జరుగుతోంది. ఇరు జట్ల మధ్య గురువారం ఈ మ్యాచ్‌ ప్రారంభమైంది. తొలి రోజు ఆటలో పాకిస్థాన్‌ ఆటగాళ్లు యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌లు ధరించినట్లు ఐసీసీకి చెందిన అవినీతి నిరోధకశాఖ విభాగానికి చెందిన ఓ అధికారి గుర్తించారు.
/ఖంతో ఐసీసీ అవినీతి నిరోధక శాఖ విభాగం అధికారులు పాక్‌ మేనేజ్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్‌ కోసం ఆటగాళ్లు మైదానంలో ఉన్న సమయంలో యాపిల్‌ స్మార్ట్‌ వాచీలు వాడకూడదని సూచించింది. సాధారణంగా మ్యాచ్‌ కోసం ఆటగాళ్లు మైదానానికి చేరుకోగానే బస్సు నుంచి దిగే సమయంలో వారి వద్ద ఉన్న వ్యక్తిగత ఫోన్లతో పాటు సమాచారాన్ని పంచుకునే ఇతర ఎలక్టాన్రిక్‌ వస్తువులను సిబ్బందికి ఇచ్చేయడం ఆనవాయితీ. నిబంధనల ప్రకారం ఇంటర్నెట్‌కు అనుసంధానమయ్యే ఏ వస్తువునైనా మైదానంలోకి అనుమతించరు. కానీ, గురువారం ఆటలో పలువురు పాక్‌ ఆటగాళ్లు చేతికి యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌లు పెట్టుకుని కనిపించారు. ‘యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌లు.. ఫోన్‌ లేదా వ్గై/కి కనెక్ట్‌ అవుతాయి. దీంతో మెసేజ్‌లు వచ్చే అవకాశం ఉంది. ఈ వాచ్‌ ఇంచుమించు ఫోన్‌లాగే పని చేస్తోంది. ఇలాంటి వాచ్‌లను పెట్టుకుని ఆడితే బుకీలు ఆటగాళ్లను సంప్రదించే అవకాశం ఉంది. తద్వారా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే పాక్‌ ఆటగాళ్లను పెట్టుకోవద్దని చెప్పాం. ‘ అని ఓ ఐసీసీ అధికారి తెలిపారు. స్మార్ట్‌ వాచ్‌లు ధరించకూడదని మాకు ముందు తెలియదు. అందుకే పెట్టుకున్నాం. ఇక నుంచి పెట్టుకోం’ అని పాక్‌ ఆటగాడు హాసన్‌ అలీ తెలిపాడు.