మొక్కజొన్న కొనుగోళ్లకు ఏర్పాట్లు
అనంతపురం,అక్టోబర్30(జనంసాక్షి): బహిరంగ మార్కెట్ కంటే ప్రభుత్వ అందించే మక్క ధరలు ధరే అధికంగా ఉన్నాయని ఏపీమార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ అన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏపీమార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పంటను కోశారు. జిల్లాలో హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, కణెళికల్లు, పెనుకొండ, తాడిపత్రి, గోరంట్ల, పుట్లూరు, యల్లనూరు, రొద్దం మండలాల్లో నవంబరు 9వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. మొక్కజొన్న కొనుగోలుకు తీసుకొచ్చే రైతులు అవి శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.