మోదీ హావిూలేమయ్యాయి?

– ఇచ్చిన హావిూల్లో వేటిని నెరవేర్చలేదు

– కాంగ్రెస్‌ పాలనతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం

– మధ్యప్రదేశ్‌ను అగ్రికల్చర్‌ హబ్‌గా మార్చుతాం

– మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ

బోపాల్‌, నవంబర్‌23(జ‌నంసాక్షి) : ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాల్లో విషయమేవిూ లేదని దేశంలో అందరికీ అర్థమైందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడిన విషయాల గురించి ప్రస్తావిస్తే ఇప్పుడు ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు. మధ్యప్రదేశ్‌లోని విదిశలో శుక్రవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ సాధారణంగా అవినీతి, రైతులు, నిరుద్యోగం గురించి మాట్లాడుతుంటారని, ఇప్పుడు ఆ విషయాల గురించి ఏవిూ మాట్లాడట్లేదన్నారు. దేశంలోని ప్రజలకు ఆయన మాట్లాడేదాంట్లో విషయమేవిూ లేదని తెలిసిందని, ఆయన ఇచ్చే హావిూలన్నీ అబద్ధాలని రాహుల్‌ విమర్శించారు. 2014 ఎన్నికల ముందు మోదీ రుణ మాఫీ, రైతులకు బోనస్‌, పంటలకు మంచి మద్దతు ధర కల్పిస్తామని హావిూ ఇచ్చారని, ఆ హావిూలన్నీ ఎందుకు నెరవేర్చలేదని రాహుల్‌ ప్రశ్నించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. యువతకు ఉద్యోగ కల్పన కోసం ముఖ్యమంత్రి రోజుకు 18గంటలు పనిచేస్తారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రైతులకు రుణమాఫీ చేస్తామని హావిూ ఇచ్చారు. దేశంలో మధ్యప్రదేశ్‌ను అగ్రకల్చర్‌ హబ్‌గా మారుస్తామన్నారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో రైతు సమస్యలు, నిరుద్యోగం అధికంగా ఉన్నాయని తెలిపారు. మన దేశంలో రోజుకు కేవలం 450 మంది యువతకు ఉద్యోగాలు దక్కుతున్నాయని, అదే చైనాలో రోజుకు 50వేల మంది ఉద్యోగాలు పొందుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం వ్యాపంగా కుంభకోణంతో విద్యా రంగాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా రాహుల్‌ రఫేల్‌ ఒప్పందంపైనా భాజపాను రాహుల్‌ దుయ్యబట్టారు.