యమునా ఎక్స్‌ప్రెస్ రహదారి ప్రారంభం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడా నుంచి ఆగ్రావరకు నిర్మించిన 165 కి.మీ. యమునా ఎక్స్‌ప్రెస్ రహదారిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ మార్గంలో న్యూఢిల్లీ నుంచి ఆగ్రాకు చేరుకునేందుకు కేవలం రెండు గంటల సమయం పట్టనుంది. ఆరులైన్లతో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రహదారిని నిర్మించారు. ఈ మార్గంలో మూడు చోట్ల టోల్ గేట్లను ఏర్పాటు చేశారు.