యస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వెంటనే ఆర్థిక పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన:ఓరగంటి చంద్రశేఖర్..

యస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వెంటనే ఆర్థిక పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన:ఓరగంటి చంద్రశేఖర్

ధర్మపురి (జనం సాక్షి)తెలంగాణ రాష్ట్రంలో దళితులపై దాడులు,హత్యలు, హత్య యత్నాలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, జగిత్యాల జిల్లా ధర్మపురి బీజేపీ యస్సిమోర్చా రాష్ట్ర కార్యదర్శి ఓరగంటి చంద్రశేఖర్ విలేకరులకు శనివారం ఉదయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆత్మగౌరవ ప్రతీకగా సాధించిన తెలంగాణలో దళితులు 2వ తరగతి పౌరులుగా జీవిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు.
అయితే రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల్లో సత్వరన్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
యస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఇప్పటి వరకు వేల కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం అందలేదని., నష్టపరిహారం అందని బాధితులకు తక్షణమే ప్రభుత్వం నిధులు సమకూర్చి వారికి భరోసాగా నిలవలన్నారు.
చార్జిషీట్ వేయడంలో జాప్యం చేయకుండ యస్సి, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, దళితులపై దాడులకు తెగబడుతోన్న వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దళితుల రక్షణ, ఆత్మగౌరవాన్ని సవాల్ చేసిన అనేక ప్రభుత్వాలను గద్దెదించిన చరిత్ర దళిత సమాజానికి ఉన్నదనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నట్లు ప్రకటించారు