యాకూబ్‌ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారు

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ : 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మాకూబ్‌, అబ్దుల్‌ రజాక్‌ మెమన్‌లకు సర్వోన్నత న్యాయస్థానం ఉరి శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో మరో పదిమంది నిందితులకు ఉరిశిక్షను మావజ్జీవ శిక్షగా మార్చింది. ముంబయి పేలుళ్ల వెనుక పాకిస్తాన్‌ హస్తముందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేలుళ్ల ప్రధాన సూత్రధారి టైగర్‌ మెమన్‌ తప్పించుకు తిరుగుతున్నాడని పేర్కొంది. పాక్‌ సైన్యం ఐఎస్‌ఐ సహకారంతో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిందని తెలిపింది. ఇమ్మిగ్రేషన్‌ చట్టాలను పాక్‌ ఉల్లంఘించిందని, ముంబయి నుంచి దుబాయ్‌ మీదుగా ఉగ్రవాదులు ఇస్లామాబాద్‌కు వెళ్లినట్లు తెలిపింది.
ఈ వ్యవహారంలో కస్టమ్స్‌ అధికారుల పాత్ర కూడా ఉందని వ్యాఖ్యానించింది. అధికారుల తీరుతో జాతి భద్రతకు ముప్పు వాటిల్లిందని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా కేసు విచారణలో ఉండగా మాజీ కస్టమ్స్‌ అధికారి ఎస్‌. ఎస్‌. థాపా మృతి చెందగా, మరణశిక్ష పడిన మహమ్మద్‌ ఇక్బాల్‌ కూడా మృతి చెందాడు.