యాసంగి పంటలకు సిద్దమవుతున్న రైతులు
ఆదిలాబాద్,నవంబర్25 (జనంసాక్షి) : జిల్లాలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. యాసంగిలో ప్రధానంగా శనగ, గోధుమ, వేరు శనగ, జొన్న పంటలను
సాగుచేస్తున్నారు. దీంతో రైతులు రెండు పంటలను పండించుకునే అవకాశం లభిస్తుంది. వేలాది మంది రైతులు రెండేళ్లుగా ప్రాజెక్టుల కింద వానాకాలం, యాసంగి పంటలను సాగుచేస్తున్నారు. ఈ సంవత్సరం వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా కురిసిన వానలతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. సాగునీటి ప్రాజెక్టులు తక్కువగా ఉండడంతో రైతులు వానాకాలం పంటలను ఎక్కువగా పండిస్తారు. జిల్లాలో సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టులు ఉండగా. జిల్లాలో యాసంగిలో రైతులు ప్రధానంగా శనగ, గోధుమ, వేరుశనగ, జొన్న పంటలను సాగుచేస్తారు. ఈ ఏడాది యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 24 వేల హెక్టార్లలో పంటలు సాగువుతాయని అధికారులు అంచనా వేశారు. రెండు ప్రాజెక్టుల్లో నీటిమట్టం ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది రైతులు యాసంగి పంటలను సాగుచేసే అవకాశం లభించింది.ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో యాసంగి పంటలను సాగు చేసే రైతులకు భరోసా ఏర్పడింది. ప్రభుత్వం ప్రాజెక్టుల పునరుద్ధరణకు భారీగా నిధులు కేటాయించడంతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన సాత్నాల, మత్తడి చివరి ఆయకట్టు భూములకు సాగు నీరు అందనుంది. సాత్నాల ప్రాజెక్టు కుడి కాలువ కింద జైనథ్ మండలంలోని 15 గ్రామాల రైతులకు చెందిన భూములకు సాగునీరు అందుతుంది. ఇదిలావుంటే జిల్లాలో అత్యధికంగా 1.35లక్షల హెక్టార్ల లో సాగు చేస్తుండడంతో మిగితా పంటలు అంతంత మాత్రంగానే సాగుచేస్తారు. అయి తే పత్తిపైనే ఎక్కువగా ఆధారపడి వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా ఉండడంతో పత్తి కూలీల రేట్లు అమాంతం పెంచేస్తున్నారు. మార్కెట్‌లో మద్ధతు ధర లేకపోయినా చేసిన కష్టం నేల పాలు కాకుండా, చేసినా అప్పులు తీర్చాలంటే కూలీల భారం మోయక రైతులకు తప్పడం లేదు. కూలీలు వేలం పాటలతో అధిక ధరలు చెల్లించే వారికి వెళ్లి పోవడంతో తక్కువ ధర చెల్లించే రైతులు కూలీల కోసం వెతుకక తప్పడంలేదు. గత్యంత రం లేక కుటుంబ సభ్యులతో కలిసి తన పొలంలో పత్తిని తీసే పరిస్థితులు కూడా తప్పడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఓ వైపు జిల్లాలో పత్తి రైతుకు మద్దతు ధర లేక లబోదిబో మంటుంటే మరోవైపు పత్తి తీతకు డిమాండ్ పెరిగి పోతుంది. ఒక్కసారిగా రైతు లకు కూలీల కొరత ఏర్పడుతోంది. లక్షల రూ పాయల పెట్టుబడి పెట్టి పంటను పండించి న రైతులకు రోజుకు రూ. 300 ఇస్తామన్న కూలీలు దోరికే పరిస్థితి కనిపించడం లేదు. దొరికిన రోజుకు రూ.200 నుంచి రూ.400 వరకు డిమాండ్ చేస్తున్నారు. రుగాలం చేసిన కష్టం నేల పాలయ్యే ప్రమాదం ఉందని అందుకు ఎంత డిమాండ్ అయిన ఇవ్వక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.