యువత లక్ష్యం ఏర్పరచుకొని ఆ దిశగా పయనించాలి- శ్రీ నారాయణ కళాశాల కరస్పాండెంట్ సంతోష్ కుమార్
యువత లక్ష్యం ఏర్పరచుకొని ఆ దిశగా పయనించాలని శ్రీ నారాయణ కళాశాల కరస్పాండెంట్ సంతోష్ కుమార్ అన్నారు.
విద్యతోపాటు విలువలను మానసిక ప్రవర్తనను విద్యార్థిని విద్యార్థుల కు అందజేయాలని ఆశయంతో శ్రీ నారాయణ జూనియర్ కళాశాల సంతోష్ కుమార్ లీడ్ ఇండియా అను జీవ నైపుణ్యాలు మరో విజ్ఞానం ప్రదర్శన లక్ష్యసిద్ధి అనే సదస్సును ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లీడ్ ఇండియా వ్యవస్థాపకులు సుదర్శన చార్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
*లీడ్ ఇండియా స్థాపకులు సుదర్శన ఆచార్యులు మాట్లాడుతూ*
నా భారతదేశం 2030 వ సంవత్సరం వరకు దేశం పురోగమించాలనే ఆలోచనతో మొదలైన ఈ లీడ్ ఇండియా కార్యక్రమం, ఒక మాములు మనిషి మహనీయుడుగా ఎదగాలని, లక్ష్యం వైపు యువత చేరాలని, దేశం యొక్క భవిష్యత్ యువత పరివర్తన ప్రవర్తన మీదే ఆధారపడిందని ఆకాంక్షస్తూ ప్రసంగించాడు.
*శ్రీ నారాయణ కళాశాల కారస్పాండెంట్ సంతోషకుమార్ మాట్లాడుతూ* యువత లక్ష్యం ఏర్పరుచుకొని ఆ దిశగా ప్రయాణం సాగించాలని, క్రమశిక్షణ, ఆత్మ విమర్శ, భాద్యతలను విస్మరించకూడదని, ఆదర్శ జీవనం గడపాలని, ప్రతీ పౌరుడు దేశ భక్తి తో మెలగాలని అందుకే కళాశాల లో 3 రోజుల లీడ్ ఇండియా సదస్సు ను ఏర్పాటు చెయ్యడం జరిగింది అన అన్నారు. విద్యార్థులందరు ఈ సమయాన్ని, అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, చెప్పారు.
లీడ్ ఇండియా ట్రైనర్స్ చే జరుపబడ్డ కార్యక్రమాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కపిల్ దేవ్, డిగ్రీ ప్రిన్సిపాల్ రాజు, ఇంటర్ ప్రిన్సిపాల్ సిద్దు రాజ్, అధ్యాపక, అధ్యాపకేతారా బృందం తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : లీడ్ ఇండియా కార్యక్రమంలో మాట్లాడుతున్న కళాశాల కరస్పాండెంట్ సంతోష్ కుమార్.
ఫోటో రైటప్ : విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతున్న లీడ్ ఇండియా వ్యవస్థాపకులు సుదర్శన చార్యులు.