యువరాజ్ పై గంభీర్ ఫన్నీ ట్వీట్

13-gambhir-yuvaraj-300మ సహచరుడు యువరాజ్ సింగ్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడంతో టీమిండియా క్రికెటర్లు అందరూ మంచి సంతోషంగా ఉన్నారు. పనిలో పనిగా యువీ మీద విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి గౌతమ్ గంభీర్ కూడా చేరిపోయాడు. చండీగఢ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఫతేగఢ్ సాహిబ్ గ్రామం వద్ద ఉన్న ధార్మిక కేంద్రం బాబా రాందేవ్ సింగ్ డేరాలో వివాహ వేడుక జరిగింది. పంజాబీ సంప్రదాయం ‘ఆనంద్ కరాజ్’  పద్ధతిలో యువీ వివాహం జరిగింది. తన స్నేహితురాలు, నటి హాజల్ కీచ్‌ను బుధవారం అతను పెళ్లాడాడు. పెళ్లిలో మంచి షేర్వాణీ ధరించిన యువరాజ్.. దాని కింద ఒక చెస్ట్ గార్డ్ ధరించి ఉంటాడని గంభీర్ అన్నాడు. అయితే.. పెళ్లి తర్వాత ఎదురయ్యే బౌన్సర్ల నుంచి మగాళ్లను కాపాడేందుకు ఇంతవరకు చెస్ట్‌గార్డులు ఏవీ తయారుచేయలేదన్న విషయం తెలుసుకోవాలన్నాడు. అయితే.. అలాంటి బౌన్సర్లను మైదానంలోను, బయట ఎదుర్కోవాలంటే ఏం చేయాలో తన దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయని, ఈసారి కలిసినప్పుడు వాటిని చెబుతానని సరదాగా ట్వీట్ చేశాడు.