యూపీఏ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు భారత్ బంద్
న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా, డీజిల్, గ్యాస్‌లపై విపక్షాలు నేడు దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే, ఈ బంద్‌కు దూరంగా ఉండాలని బహుజన సమాజ్ పార్టీ నిర్ణయించింది. లోక్‌సభలో 21 మంది ఎంపీలున్న ఆ పార్టీ తమకు మద్దతుగా నిలవడం యూపీఏకు ఊరటనిచ్చే అంశం. యూపీఏతో తమ అనుబంధం ఎలా ఉండాలనే విషయంపై అక్టోబర్ 9న నిర్ణయం తీసుకుంటామని పార్టీ అధ్యక్షురాలు మాయావతి తెలిపారు. ఈ బంద్‌కు సీపీఐ, సీపీఎం, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ తదితర పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.