రక్తదానం చేసి ప్రణదాతలుగా నిల్వాలి
. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 17 , ( జనం సాక్షి) : డివిజన్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భారత స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా డీఆర్డీ ఓ ఆధ్వర్యంలో రక్తదానశిబిరం ఏర్పాటు చేసారు. ఈ రక్తదాన శిబిరాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే రాజయ్య, జెడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి, కలెక్టర్ శివ లింగయ్య తో కలిసి ప్రారంభించా రు.ఈసందర్భంగామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన ఆరోగ్యా నికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. స్వా తంత్ర ఉద్యమ స్ఫూర్తితోనే ఆనాటి ఉద్యమ రథ సారథి కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేపట్టి రాష్ట్రంసాధించుకున్నామ న్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబా టులో లేకపోవడంతో ఎంతోమందిప్రాణాలుకోల్పో తున్నారన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయా లన్నారు. అనంతరం రక్తదానం చేసిన స్టేషన్ ఘన్ పూర్ తహసీల్దార్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్రువపత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమం లో ఎంఎల్ఏ డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగా మ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డివో రాంరెడ్డి, డీఎంహెచ్ఓ మహేంద ర్, సూపర్డెంట్ సుగుణా కర్ రాజు,డిప్యూటీ డీఎం హెచ్ఓ సుధీర్, జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి,ఎంపీపీ కందుల రేఖగట్టయ్య, ఆఫీ సు ఇంచార్జీ ఆకుల కుమార్ మార్కెట్ చైర్మన్ గుజ్జ రి రాజు,తహసీల్దార్ పూల్ సింగ్ చౌహన్, సీఐ శ్రీని వాస్ రెడ్డి,మెడికల్ ఆఫీసర్ శ్రీవాణి, ఎస్ఐ శ్రవణ్, అన్నిశాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు తదిత రులు పాల్గొన్నారు.