రక్తదాన శిబిరంలో పాల్గొన్న మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు

పినపాక నియోజకవర్గం ఆగష్టు 27 (జనం సాక్షి):మణుగూరు కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ హైదరాబాద్, మణుగూరు టి ఎస్ ఆర్ టి సి సంయుక్త ఆధ్వర్యంలో మణుగూరు బస్సు డిపో ఆవరణలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం (NSS) వాలంటీర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ రక్తదాన శిబిరంలో పాల్గొనీ మాట్లాడారు.
కళాశాల లియో క్లబ్, ఎన్ ఎ ఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అత్యవసర పరిస్థితులలో రక్త సేకరణ వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడుకోవచ్చు అన్నారు. ప్రతి వ్యక్తి ఆరు నెలలకు ఒకసారి రక్తం ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టు తో పాటు తోటి వారికి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఎస్ఆర్టీసి డిపో మేనేజర్ బి.శ్రీనివాసరావు, డాక్టర్ యస్ ఎల్ కాంతారావు, వై సూర్యనారాయణ, కే.భాను ప్రసాద్, కే రవికుమార్, హెచ్ డీ ఎఫ్ సీ సిబ్బంది వంశీ, సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ జూపూడి అనిల్ కుమార్, డాక్టర్ ఎ.అనురాధ, డాక్టర్ రమేష్ బాబు, భాస్కరరావు, రామతిరుపతి, సాంబమూర్తి, నాగిరెడ్డి, అశోక్ , సతీష్ , శిరీష , రవి, జబ్బార్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.