రమణారెడ్డి భార్య కన్నుమూత
నెల్లూరు,అక్టోబర్26(జనం సాక్షి): తెలుగు చలనచిత్రసీమలో అలనాటి హాస్యనటుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి భార్య సుదర్శనమ్మ(93) శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత సంవత్సరం నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమెకి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సుదర్శనమ్మ అంత్యక్రియలు నెల్లూరులో జరుగుతాయని బంధువులు తెలిపారు. సుదర్శనమ్మ భర్త రమణారెడ్డి నవంబరు 11, 1974 లో కన్నుమూశారు. టాలీవుడ్ లో మొదటి హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నారు. బంగారుపాప , మిస్సమ్మ చిత్రాలతో రమణారెడ్డి ప్రతిభ ప్రేక్షకులకీ, పరిశ్రమకీ బాగా చేరువయ్యారు. సినిమాల్లోకి వచ్చినప్పుడు రమణారెడ్డి బక్కగా ఉండేవాడు?.. అయినా చనిపోయే వరకు కూడా బక్కగానే ఉన్నాడు. అలా వుండడమే తనకు దేవుడిచ్చిన వరం పలుమార్లు తోటీ నటులకు చెప్పేవాడు. ఆ శరీరం రబ్బరు బొమ్మ తిరిగినట్టు, చేతులూ, కాళ్లు కావలసిన రీతిలో తిప్పడమే కాకుండ దబ్బున కూలిపోవడం, డభాలున పడిపోవడం ఒక్క రమణారెడ్డికి సాధ్యమయ్యేది. హాస్యం పండించలంటే తొలుతగా దర్శక నిర్మాతలందరూ రమణారెడ్డినే సినిమాల్లోకి సెలెక్ట్ చేసుకునేవారు.