రాజ్యసభ అభ్యర్థిగా సింఫ్వీు నామినేషన్
కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్ మంత్రులు
హైదరాబాద్,ఆగస్ట్19 (జనం సాక్షి): కాంగ్రెస్ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఫ్వీు నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. రాజ్యసభలో తొమ్మిది రాష్టాల్రకు చెందిన 12 స్థానాలకు సెప్టెంబరు 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, కామఖ్య ప్రసాద్, వివేక్ ఠాకుర్, రాజేభోస్లే, బిప్లబ్ కుమార్ దేబ్(భాజపా), విూసా భారతి(ఆర్జేడీ), దీపేంద్రసింగ్ హుడా, కె.సి.వేణుగోపాల్(కాంగ్రెస్) లోక్‌సభకు ఎన్నికయ్యారు. వారంతా రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఒడిశాలో బీజేడీ ఎంపీ మమతా మొహంత తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ నుంచి భారాస రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కె.కేశవరావు సైతం కాంగ్రెస్‌లో చేరి పదవికి రాజీనామా చేశారు. దాంతో ఈ 12 ఖాళీలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఈ మేరకు తెలంగాణ నుంచి తమ అభ్యర్థిగా అభిషేక్ సింఫ్వీుని కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. సుదీర్ఘకాలంగా ఆయన పార్టీకి సేవలందిస్తున్నారు. 2001 నుంచి కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. రెండు దఫాలు(2006, 2018)గా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి పోటీచేసి భాజపా చేతిలో ఓడిపోయారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం స్థానిక నాయకులు కొందరు ప్రయత్నించినా… జాతీయ రాజకీయాల్లో సింఫ్వీు సేవలు కాంగ్రెస్‌కు కీలకమైనందున ఆయన్నే అభ్యర్థిగా ఖరారు చేసినట్లు పార్టీ నేతలు వివరించారు. తెలంగాణలో కే కేశవరావు తమ పదవులకు, పార్టీలకు రాజీనామాలు చేశారు. దాంతో దేశవ్యాప్తంగా మొత్తం 12 రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీ స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేసేందుకు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మనుసింఘ్విని రంగంలోకి దించారు. దాంతో ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు ముందు ఆయన అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ తెలంగాణ మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సింఘ్వికి స్వాగతం పలికారు. ఆయన మెడలో పూలమాల వేసి, కాంగ్రెస్ కండువా కప్పి సత్కరించారు.