రాధమ్మ దశదినకర్మలో బలగం బృందం

 

 

వరంగల్ ఈస్ట్, జూలై 17 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని కరీమాబాద్ కాముని పెంట ప్రాంతానికి చెందిన శ్యామంతుల రాధమ్మ ఇటీవల మృతి చెందింది. అయితే సోమవారం ఆమె దశదిన కర్మ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బలగం సినిమా లో నటించి పాటలతో ప్రజల గుండెలను హత్తుకున్న పి. మొగిలి కొమరమ్మ దంపతులతో పాటు వారి బృందం హాజరయ్యారు. రాధమ్మ మృతికి సంతాప సూచకంగా పలు పాటలతో హృదయాలను కరిగించారు. 98 మంది శామంతుల కుటుంబాల బలగం నడుమ రాధమ్మ దశదిన కర్మను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాధమ్మ కుటుంబ సభ్యులు శామంతుల సాంబయ్య, వెంకటేశ్వర్లు, కుమారస్వామి, లేట్ చంద్రమౌళి కుటుంబ సభ్యులు తోపాటు సరోజన, సుజాత, భాగ్యలక్ష్మి, శ్రీలత తో పాటు అల్లుళ్ళు పాల్గొన్నారు. స్థానిక బంధువులు పిన్న మల్లేశం,  మల్లూరు బాబురావు  షేర్ల కిషోర్, సాగర్ల శ్రీనివాస్ అలాగే చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి తోపాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.