రాయికోడ్ మండలం లోని ఇంగ్లీష్ మీడియం,

జులై   జనం సాక్షి  రాయికోడ్ మండలం లోని ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కలిపి 47 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత  పాఠశాలలకు ఎంఇఓ శ్రీనివాస్ సోమవారం టెక్స్ట్ బుక్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఇఓ శ్రీనివాస్ మాట్లాడుతూ  మండల కేంద్రం లోని ఎమ్మార్సీ కార్యాలయం లో సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు 47 పాఠశాలలకు గాను మొత్తం  12,383 బుక్స్ అందజేశామన్నారు.  1వ తరగతి నుండి 8 వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియం బుక్స్, 9 వ, 10వ తరగతులకు తెలుగు  మీడియం బుక్స్ అందజేసినట్టు చెప్పారు. ఉపాధ్యాయులు విఠల్ సిబ్బంది సీఆర్పీలు  పాల్గొన్నారు