రాష్ట్రంలో డిజిటల్‌ సంతకాల చెల్లుబాటుకు వీలు కల్పిస్తూ జీవో జారిచేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ ఆర్థిక లావాదేవీలా రశీదుల, ధ్రువపత్రాలకు ఎలాక్ట్రానిక్‌ పద్దతిలో డిజిటల్‌ సంతకాల చెల్లుబాటుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి వి.భాస్కర్‌ ఈ మేరకు ఇచ్చిన జీవోలో వివిధ బిల్లులు, సర్టిఫికెట్లకు డిజిటల్‌ సంతకంతో ఇవ్వడానికి అనుమతించారు. ఇన్మర్మేషన్‌ టెక్నలజి (ఎలాక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివర్‌)  రూల్స్‌ 2011 ప్రకారం ఈ అనుమతి ఆస్తున్నట్లు, అన్ని ప్రభుత్వ వ్యవహారాలకు ఇంక్‌ సంతకం రబ్బరు స్టాంపులకు బదులుగా డిజిటల్‌ సంతకాలు చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక కోడ్‌లోని ఆంధ్రప్రదేశ్‌ ఖజానా కోడ్‌, ఆర్టికల్స్‌ నిబంధనలను ఈ మేరకు సవరిస్తున్నట్లు  ప్రభుత్వం వెల్లడించింది. ఈ డిజిటల్‌ సంతకాల వల్ల ఈ-సేవా, మీ-సేవా కేంద్రాల్లో మరిన్ని సర్టిఫికెట్లు అందుబాటులోకి రానున్నాయి.