రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వీ పరీక్షకు 78.46 శాతం హాజరు

హైదరాబాద్: వీఆర్వో పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. వీఆర్వో పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 78.46 శాతం హాజరయ్యారని టీఎస్పీఎస్సీ తెలిపింది. 31 జిల్లాల్లో 2,945 పరీక్ష కేంద్రాలను టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు చేసింది. ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరిగింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 627 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.