రాష్ట్ర అభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యం: డాక్టర్ కే లక్ష్మణ్

తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చేందుకు ,వారి ఆకాంక్ష మేరకు పని చేస్తానని ఓ బి సి మోర్చా జాతీయ అధ్యక్షుడు,రాజ్య సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. కుషాయిగూడ లోని లక్ష్మి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన అభినందన సభలో ఆయన ప్రసంగించారు . రాష్ట్రంలో అవినీతితో కూడిన కుటుంబ పాలన సాగిస్తూ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు,  రాష్ట్ర అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోడీ నాయకత్వంలో విజయం తథ్యమని అన్నారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ జరిగిన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ,మాజీ మంత్రి విజయ రామారావు , జిల్లా బిజెపి అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి , కార్పోరేటర్లు , సీనియర్ పార్టీ నాయకులు వల్లపు జగన్ యాదవ్,ఏ ఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షుడు కన్నెబోయిన రమేష్ యాదవ్,  ఉపేందర్ యాదవ్ ,నాంచారి  తదితరులు పాల్గొన్నారు.