రాష్ట్ర మహిళ కమీషన్ సభ్యురాలును కలిసి పరామర్శించిన జిల్లా లైవ్ అధ్యక్షుడు.

జనంసాక్షి న్యూస్నెరడిగొండ:
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుంర్రం ఈశ్వరి బాయి భర్త కుంర్రం రాజు టీచర్ గత వారం రోజుల క్రితం గుండెపోటుతో చనిపోవడం జరిగింది.ఇట్టి విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ జిల్లా లైవ్ అధ్యక్షుడు మహేందర్ జాధవ్ సోమవారం రోజున ఇంద్రవెళ్లి లోని వారి స్వగృహానికి వెళ్లి ఈశ్వరి బాయిని పరామర్శించారు.ఈ సందర్భంగా రాజు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆయన తోపాటు తేజపూర్ ఎంపీటీసీ అల్లూరి గంగమ్మ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
Attachments area



