రాష్ర్టానికి వర్షసూచన

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ఈనెల 18వతేదీన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా… దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.