రిలయన్స్ గుప్పిట్లో కేంద్ర సర్కార్
వత్తిళ్లకు లొంగని జైపాల్ శాఖమార్చిండ్రు
కేజ్రీవాల్ ధ్వజం
న్యూఢిల్లీ,అక్టోబర్ 31(జనంసాక్షి):
సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ మరో బాంబు పేల్చారు. అవినీతిపై సమరం సాగి స్తున్న ఆయన తాజాగా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ వల్లనే కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి శాఖ మారిందని ఆరోపించారు. ఇది వరకు బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలపై తీవ్ర ఆరోపణలు చేసిన కేజీవ్రాల్ తాజాగా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీపై పడ్డారు.రిలయన్స్ గ్యాస్ ధరను పెంచడాన్ని జైపాల్ రెడ్డి వ్యతిరేకించారని, అందుకే జైపాల్ రెడ్డి శాఖ మారిందని ఆయన అన్నారు. పారిశ్రా మిక వేత్తలు, రాజకీయ నేతలు కలసి దేశాన్ని దోచుకుంటున్నారని ఆన్నారు. దేశాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ నడపించడం లేదని, ముకేష్ అంబానీ నడుపుతున్నారని ఆయన వ్యాఖ్యానిం చారు. బిజెపి, కాంగ్రెసు రెండు పార్టీలు కూడా ముకేష్ అంబానీ మాటలే వింటున్నాయని ఆయన అన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికా రంలో ఉన్నా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబా నీ మాటే చెల్లుతుందనిసంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో గ్యాస్ ధరలను రిలయన్స్ నిర్ధారిస్తుందని, దానిని కేంద్రం అమలు చేస్తుందని అన్నారు. అంబానీలు దాదా గిరి చేస్తున్నారని ఆయన రోపించారు.రాజకీయం-వ్యాపారం మొత్తంగా కుమ్మక్కయ్యాయని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ముఖేష్ అంబానీ మాటే తుందని కేజీవ్రాల్ ఆరోపించారు. రిలయన్స్ చెప్పినవారినే పెట్రోలియం అధికారులుగా నియమిస్తున్నారని, కేబినెట్లో మంత్రులను పారిశ్రామికవేత్తలే నిర్ణయిస్తున్నారని, దేశాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ కాకుండా, ముఖేష్ అంబానీ పాలిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు దోస్తులని కేజీవ్రాల్ ఎద్దేవా చేశారు. నీరా రాడియా, మాజీ ప్రధాని వాజ్‌పేయ్ అల్లుడు రంజన్ భట్టాచార్య మధ్య జరిగిన సంభాషణల ఆడియో టేపును ఆయన బుధవారం విూడియా ప్రతినిదుల సమావేశంలో విడుదల చేశారు.తాను గులాం నబీ ఆజాద్‌ను మేనేజ్ చేయగలలని రంజన్ భట్టాచార్య చెప్పారని ఆయన అన్నారు. గతంలో మణిశంకర్ అయ్యర్ కూడా పదవిని కోల్పోయారని గుర్తు చేశారు.పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల మధ్య కుమ్మక్కు వల్లనే దేశంలో ధరలు పెరుగుతన్నాయని కేజీవ్రాల్ అన్నారు. కేంద్ర మంత్రి వర్గ కూర్పుపై రాడియా, భట్టాచార్య మధ్య జరిగిన సంభాషణలు టేపుల్లో ఉన్నాయి. గ్యాస్ ధరను ప్రభుత్వం నిర్ణయించలేదని, ముకేష్ అంబానీ నిర్ణయించారని, గ్యాస్ క్యూబిక్ విూటరు ధరను 2.5 నుంచి 4.25 డాలర్లకు పెంచాలని ముకేష్ అంబానీ సూచించారని అన్నారు. కెజి బేసిన్ రిలయన్స్‌కు దక్కడం వెనక రాజకీయ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. కొంత మంది మంత్రుల జేబులు నింపుతున్నందు వల్లనే రిలయన్స్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రిలయన్స్ దేశాన్ని దోచుకుంటోందని వ్యాఖ్యానించారు. గ్యాస్ ధరల విషయంలో ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా నిర్ణయించిందని అన్నారు. కేజీవ్రాల్‌తో పాటు- ప్రశాంత్ భూషణ్ కూడా విూడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు.
ఆరోపించారు.రాజకీయం-వ్యాపారం మొత్తంగా కుమ్మక్కయ్యాయని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ముఖేష్ అంబానీ మాటే తుందని కేజీవ్రాల్ ఆరోపించారు. రిలయన్స్ చెప్పినవారినే పెట్రోలియం అధికారులుగా నియమిస్తున్నారని, కేబినెట్లో మంత్రులను పారిశ్రామికవేత్తలే నిర్ణయిస్తున్నారని, దేశాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ కాకుండా, ముఖేష్ అంబానీ పాలిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు దోస్తులని కేజీవ్రాల్ ఎద్దేవా చేశారు. నీరా రాడియా, మాజీ ప్రధాని వాజ్‌పేయ్ అల్లుడు రంజన్ భట్టాచార్య మధ్య జరిగిన సంభాషణల ఆడియో టేపును ఆయన బుధవారం విూడియా ప్రతినిదుల సమావేశంలో విడుదల చేశారు.తాను గులాం నబీ ఆజాద్‌ను మేనేజ్ చేయగలలని రంజన్ భట్టాచార్య చెప్పారని ఆయన అన్నారు. గతంలో మణిశంకర్ అయ్యర్ కూడా పదవిని కోల్పోయారని గుర్తు చేశారు.పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల మధ్య కుమ్మక్కు వల్లనే దేశంలో ధరలు పెరుగుతన్నాయని కేజీవ్రాల్ అన్నారు. కేంద్ర మంత్రి వర్గ కూర్పుపై రాడియా, భట్టాచార్య మధ్య జరిగిన సంభాషణలు టేపుల్లో ఉన్నాయి. గ్యాస్ ధరను ప్రభుత్వం నిర్ణయించలేదని, ముకేష్ అంబానీ నిర్ణయించారని, గ్యాస్ క్యూబిక్ విూటరు ధరను 2.5 నుంచి 4.25 డాలర్లకు పెంచాలని ముకేష్ అంబానీ సూచించారని అన్నారు. కెజి బేసిన్ రిలయన్స్‌కు దక్కడం వెనక రాజకీయ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. కొంత మంది మంత్రుల జేబులు నింపుతున్నందు వల్లనే రిలయన్స్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రిలయన్స్ దేశాన్ని దోచుకుంటోందని వ్యాఖ్యానించారు. గ్యాస్ ధరల విషయంలో ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా నిర్ణయించిందని అన్నారు. కేజీవ్రాల్‌తో పాటు- ప్రశాంత్ భూషణ్ కూడా విూడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు.