రుణం తీరలే…బతుకు మారలే

ట్విట్టర్‌ వేదికగా కెటిఆర్‌ విమర్శలు
హైదరాబాద్‌,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసానికి పాల్పడుతోందని కేటీఆర్‌ పదే పదే విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. రుణం తీరలే, రైతు బతుకు మారలే.. ! స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్స్‌ కమిటీ (ఎస్‌ఎల్బీసీ) లెక్క రూ. 49,500 కోట్లు. కేబినెట్‌ భేటీలో చెప్పింది రూ. 31 వేల కోట్లు బ్జడెట్లో కేటాయించింది. రూ. 26 వేల కోట్లు 3 విడతల వారీగా కలిపి ఇచ్చింది రూ. 17933 కోట్లు. ఒకే విడతలో రెండు లక్షల రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు .. నిలదీస్తే బెదిరింపులు. అయినా తగ్గేదే లేదు.. నిగ్గదీసి అడుగుతాం.. నిజాలే చెపుతాం. కాంగ్రెస్‌ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటాం‘ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.