రెండు గ్లాసుల పద్ధతి మానుకోవాలి

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 30 శంకరా పట్నం మండల పరిధిలోని తాడికల్ గ్రామంలో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవానికి ముఖ్యఅతిథిగా వైస్ ఎంపీపీ పులికోట రమేష్ మాట్లాడుతూ పౌర హక్కుల దినోత్సవం 1964లో ఒక చట్టాన్ని తయారుచేసి పౌర హక్కుల దినోత్సవం పొందుపరిచారు ఎస్సీ ఎస్టీలకు భారతదేశంలో అన్యాయం జరుగుతే భరోసాగా నిలబడడానికి ఈ చట్టాన్ని తయారు చేశారని పేర్కొన్నారు గ్రామాలలో రెండు గ్లాసుల పద్ధతి మానుకోవాలని దేవాలయాలకు వెళ్లకుండా అడ్డుకుంటే ఎవరైనా చట్టాలను అతిక్రమించినచో ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు రాజ్యాంగ నిర్మాణ ఆదేశాల మేరకు అందరు పనిచేయాలని మహిళలు స్వేచ్ఛగా జీవించడానికి వారికి సమానమైన హక్కులు కల్పించిన మహా వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దళితులను బాగు చేయడానికి ఆలోచన చేసే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు దళితులకు దళిత బంధు పెట్టి ధనికులుగా చేయాలని ఉద్దేశంతో ఈ పథకం అమలు చేశారని ఈ పథకాన్ని దళితులందరూ సద్వినియోగం చేసుకొని చైతన్యవంతులు కావాలని అన్నారు అక్షరమే ఆయుధమై విద్యుత్ తోనే మార్పులు వస్తాయని ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో తాటికల్ సర్పంచ్ కీసర సుజాత సంపత్ ఉపసర్పంచ్ ఎంపీటీసీ వరలక్ష్మి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మైపాల్ ఎంపీడీవో ఆర్ ఐ ఎస్ ఐ అంబేద్కర్ సంఘం నాయకులు కన్కం శంకర్ నరసయ్య ఐలయ్య ఓదెలు తదితరులు పాల్గొన్నారు