రెండోరోజుకు వేగుంటరాణి పాదయాత్ర

అమరావతి,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  టిడిపి మహిళా నేత వేగుంట రాణి చేపట్టిన పాదయాత్ర శనివారంతో 2 వ రోజుకు చేరింది. ప్రస్తుతం రాజధాని గ్రామాలలో పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు శనివారం తుళ్ళూరు ఎంపిపి పద్మలత ఆధ్వర్యంలో మహిళలు సంఘీభావం ప్రకటించారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో మహిళలు, టిడిపి శ్రేణులు పాల్గొన్నారు. అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి విజయవాడ కనకదుర్గ ఆలయం వరకు పాదయాత్ర కొనసాగనుంది. చంద్రబాబు, శ్రీధర్‌ మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుతూ వేగుంట రాణి ఈ పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు.

తాజావార్తలు