రెండో స్థానంలో ఇంగ్లండ్‌ దిగజారిన భారత్‌ ర్యాంకు

దుబాయ్‌, డిసెంబర్‌ 17: భారత గడ్డపై 28 ఏళ్ళ తర్వాత టెస్ట్‌ సిరీస్‌ విజయాన్ని రుచి చూసిన ఇంగ్లాండ్‌ జట్టు ఐసిసి ర్యాంకింగ్స్‌లో తమ రెండో స్థానం నిలుపుకుంది. ఈ సిరీస్‌ విక్టరీ తో ఆజట్టు ర్యాంకింగ్‌ మారకున్నా రేటింగ్‌ పాయింట్‌ మాత్రం పెరిగింది. 117 పాయింట్లతో సిరీస్‌ ప్రారంభించిన కుక్‌ సేన ఇప్పుడు ఒక పాయింట్‌ దక్కించుకుంది. ప్రస్తుతం నెంబర్‌ వన్‌ టీమ్‌ దక్షిణాఫ్రికాకు, ఇంగ్లాండ్‌కు మధ్య ఐదు పాయింట్ల తేడా ఉంది. ప్రస్తుతం శ్రీలంకతో జరు గుతోన్న సిరీస్‌లో ఆసీస్‌ 3-0 తేడాతో గెలిచినప్ప టకీ ఇంగ్లాండ్‌ ర్యాంకుకు ఇబ్బంది లేదు. మరొ ళివైపు సిరీస్‌ కోల్పోయిన ధోనీసేన ర్యాంకింగ్‌లో మార్పు లేకున్నా ఒక రేటింగ్‌ పాయింట్‌ పోయిం ది. ప్రస్తుతం ఐసిసి జాబితాలో ఐదో స్థానం దక్కించుకున్న భారత్‌ ఖాతాలో 105 పాయింట్లు న్నాయి. మూడో స్థానంలో ఆస్టేల్రియా, నాలుగో స్థానంలో పాకిస్థాన్‌ కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ర్యాంకింగ్స్‌లో టాప్‌ ఫైవ్‌ జాబితాకు సంబం ధించి ఆసక్తి కరమైన రేస్‌ నడుస్తోంది. ఈ ఐదు జట్ల మధ్య 18 పాయింట్ల తేడా మాత్రమే ఉండడంతో ఏప్రిల్‌ 1 లోపు మరిన్ని మార్పులు జరిగే అవకాశ ముంది. కటాఫ్‌ డేట్‌ లోపు తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఐసిసి అందించే 3.8 మిలియన్ల ప్రైజ్‌మనీ పంచుకోనున్నాయి. ఇక ఐసిసి వ్యకి ్తగత ర్యాంకింగ్స్‌ జాబితా బుధవారం మారనుంది.

ఐసిసి టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ ః

1. దక్షిణాఫ్రికా  – 123 పాయింట్లు

2. ఇంగ్లాండ్‌    – 118 పాయింట్లు

3. ఆస్టేల్రియా – 114 పాయింట్లు

4. పాకిస్థాన్‌    – 109 పాయింట్లు

5. భారత్‌       – 105 పాయింట్లు

6. శ్రీలంక      – 96 పాయింట్లు

7. వెస్టిండీస్‌    – 91 పాయింట్లు

8. న్యూజిలాండ్‌ – 79 పాయింట్లు

9. బంగ్లాదేశ్‌     – 0 పాయింట్లు