రేపు…. ఎమ్మార్పీఎస్ జిల్లా సమావేశం

విజయవంతం చేయండి.
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వికారాబాద్ జిల్లా
కొడిగంటి మల్లికార్జున్ మాదిగ.
తాండూరు సెప్టెంబర్ 30(జనంసాక్షి) రేపు నిర్వహించే ఎమ్మార్పీఎస్ జిల్లా సమావేశం
విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వికారాబాద్ జిల్లా కొడిగంటి మల్లికార్జున్ మాదిగ పేర్కొన్నారు.శనివారం తాండూర్ నియోజకవర్గ స్థాయి ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి నాయకుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశనికి ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కోడిగంటి మల్లికార్జున్ మాదిగ హాజరై మాట్లాడుతు ఎమ్మార్పీఎస్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ నాయకత్వంలో జరుగుతున్న ఉద్యమం చివరి దశకు చేరుకుందని ఆశాభావం వ్యక్తం చేశారు.దానికి నిదర్శనం గతంలో సుప్రీంకోర్టులో ఎమ్మార్పీఎస్ వర్గీకరణ పై వేసినా కేసు చివరి దశకు రావడం సెప్టెంబర్ 25న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్సీ వర్గీకరణ పై విచారణకు సమయాన్ని కేటాయిస్తామని చెప్పటం అట్లాగే 7గురితో కూడిన న్యాయమూర్తుల బెంచ్ ఏర్పటు చేస్తామని విచారణకు సమయం కేటాయిస్తామని చెప్పటం మాదిగ చిరకాల స్వప్నం నెరవేర బోతుందని అని అన్నారు. మరో వైపు పార్లమెంట్ లో నవంబర్ నెలలో శీతాకాల సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టే విధంగా కూడా ప్రయత్నం చేసేందుకు కేంద్రం పై ఒత్తిడి పెంచేందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అక్టోబర్ 4నుంచి – నవంబర్ 4వరకు .అలంపూర్ టూ హైదరాబాద్ వరకు మాదిగల విశ్వరూప పాదయాత్ర పేరుతో పాదయాత్ర కూడా చేస్తున్నారని అన్నారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు.జిల్లా నుంచి అదిక సంఖ్యలో పాల్గొనలని ప్రణాళిక సిద్ధం చేసికొడానికి ఆదివారం అక్టోబర్ 1న తాండూర్ కేంద్రంగా ఎమ్మార్పీఎస్ జిల్లా సమావేశం నిర్వహించనున్నమని మల్లికార్జున్ మాదిగ అన్నారు.ఈ సమావేశానికి జిల్లా ముఖ్య నాయకులు వివిధ మండలాల ఇంఛార్జిలు అధ్యక్షులు హజరు కావాలని కోరారు.ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రచారకార్య దర్శి డప్పు నర్సింలు మాదిగ ఎం ఎస్ పి తాండూర్ మండల ఇంఛార్జి నర్సింలు మాదిగ యాలల్ మండల ఇంఛార్జి డప్పు నర్సింలు మాదిగ బొమ్రెస్పట్ మండల కన్వీనర్ తిరుపతి మాదిగ అల్ ఇండియా అంబేడ్కర్ సంఘం నాయకులు బుడగజంగం వెంకటేష్, ఎం ఎస్ ఎఫ్ నాయకులు జాని మాదిగ,
సురేష్ మాదిగ , బి. నర్సింలు మాదిగ తదితరులు పాల్గొన్నారు.