రేపు పదోతరగతి, ఇంటర్ దూరవిద్య ఫలితాలు
హైదరాబాద్: పదోతరగతి ఇంటర్మీడియట్ దూరవిద్య వార్షిక ఫలితాలు ఆదివారం వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాలను ప్రాథమిక విద్యామంత్రి ఎస్.శైలజానాథ్ విడుదల చేస్తారు. స్కూల్ డ్రాపవుట్లకు విద్యనందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2008లో పదోతరగతి దూరవిద్యను ప్రవేశపెట్టింది. మొదటి ఏడాది పదోతరగతిలో 58వేల మందితో ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రారంభమైంది. 2012పదోతరగతి పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య లక్షా 12వేలకు పెరిగింది. 2010లో ప్రవేశపెట్టిన ఇంటర్ దూరవిద్యకు సైతం ఆదరణ లభిస్తోంది. ఈ ఏడాది ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 75వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.