రేవంత్ రెడ్డి పాదయాత్ర,కార్నర్ మీటింగ్ విజయవంతం చేయండి.

టిపిసిసి సభ్యులు కాసుల బాలరాజ్.

కోటగిరి మార్చి 17 జనం సాక్షి:-టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గంలో చేపట్టే పాదయాత్ర,కార్నర్ మీటింగ్నీ కాంగ్రెస్ శ్రేణులు జయప్రదం చేయాలని బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కాసుల బాలరాజ్ కోరారు. కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.ఈ నెల 20వ తేదీ సోమవారం రోజున బాన్సువాడ నియోజకవర్గం నసుర్లబాద్ మండల కేంద్రంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాత్ సే హత్ జూడో పాదయాత్ర ఉదయం 8 గ.లకు ప్రారంభమవుతుందన్నారు.ఈ పాదయాత్రలో పోతంగల్,కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,అభిమానులు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.అలాగే బాన్సువాడ పట్టణ కేంద్రం లోని క్రాస్ రోడ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద అదే రోజున సాయంత్రం 6 గం.లకు నిర్వహించే కార్నర్ మీటింగ్ సమావేశాన్ని జయప్రదం చేయాలనీ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్నర్ మీటింగ్, పాదయాత్రలో రాష్ట్రస్థాయి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్,మాజీ మంత్రి షబ్బీర్ అలీ,సుదర్శన్ రెడ్డి,జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షట్కర్,జిల్లా అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్, మానాల మోహన్ రెడ్డి,అతిరథ మహా నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు.ఈ మీడియా సమావేశం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్,డెలిగేట్ సభ్యులు కొట్టం మనోహర్, హనుమంతు,పోతంగల్ సొసైటీ వైస్ చైర్మన్ గంధపు పవన్,కోటగిరి,పోతంగల్ ఎత్తొండ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అయుబ్,పి.సాయిలు,తయ్యబ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు