రేషన్ కార్డు ఉన్న ప్రతి గృహిణికి వెయ్యి రూపాయలు
డీఎంకే చీఫ్ స్టాలిన్
చెన్నై07 మార్చి (జనం సాక్షి): డీఎంకే అధికారం లోకి వస్తే రేషన్‌కార్డు ఉన్న ప్రతి గృహిణికి నెలకు రూ.1000 ఇస్తామని ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ హావిూ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో త్రిచీలో ఆదివారం భారీ పార్టీ సమావే శాన్ని నిర్వహించారు. డీఎంకే కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పొడవున ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై స్టాలిన్ నడిచి అందరికీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు అభివృద్ధి కోసం పదేండ్ల వ్యూహాన్ని ప్రకటించారు. వచ్చే దశాబ్ద కాలంలో తమిళనాడును అన్ని రంగాలలో మొదటి స్థానా నికి చేర్చడమే ఈ విజన్ లక్ష్యమని అన్నారు.ఏడు ప్రధాన రంగాలైన ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, నీటి వనరులు, విద్య మరియు ఆరోగ్యం, పట్టణా భివృద్ధి, గ్రావిూణ మౌలిక సదుపాయాలు, సామా జిక న్యాయం విజన్ గురించి స్టాలిన్ పేర్కొన్నారు. సామాజిక న్యాయంలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులో ఇంటి అధిపతిగా పేర్కొన్న ప్రతి గృహిణికి నెలకు రూ .1000 ఇస్తామని హావిూ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ మొత్తాన్ని రెట్టింపు చేస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు ఈ నెల 11న పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామని స్టాలిన్ ఇటీవల ప్రకటించారు. ఇది ప్రజల మేనిఫెస్టో అని, ప్రజల భాగస్వామ్యంతో రూపొందించినది తెలిపారు. తమిళనాడు ప్రజలకు కొత్త ఆరంభం కోసం అందులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. 2006 ఎన్నికల్లో కలైగ్నార్ (కరుణానిధి) విడుదల చేసిన పార్టీ మ్యానిఫెస్టో మాదిరిగా ఇది ఎన్నికల హీరో అవుతుందని ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.