రైతులందరూ ఆగస్టు 31 లోగా ఈ కేవైసీ ఆన్లైన్ చేసుకోవాలి

ఈ–కేవైసీ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే పీఎం కిసాన్ నగదు జమ కానుంది.
– డీఏవో భూక్య చత్రు నాయక్

డోర్నకల్ ఆగస్టు-24 (జనంసాక్షి న్యూస్)

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో ఏడాదికి మూడు సార్లు జమ చేస్తుంది. ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు రూ.6వేల నగదును కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఈ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా గతంలో కేవైసీ చేసుకున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఆగస్టు 31 లోపు ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందని డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామం రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ డోర్నకల్ మండలానికి సంబంధించిన ఏఈఓ ల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు విజ్ఞప్తి మీకు తెలిసిన మరియు మి తోటి రైతులకు 31-1-2019 నాటికి పట్ట దారు పాస్ పుస్తకం వచ్చి వుండి పిఎం కిషన్ డబ్బులు పడుతున్న వారందరు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవలసి వుంటుంది. ఈ–కేవైసీ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే పీఎం కిసాన్ నగదు జమ కానుంది.
అయితే ఈనెల 31లోగా రైతులందరూ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది అని అలా అయితేనే వాళ్ల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేసింది. ఈ కేవైసీ ధ్రువీకరణను రైతులు యాప్‌ ద్వారా పీఎం కిసాన్‌ పోర్టల్‌లో ఉచితంగా చేసుకోవచ్చు. లేదంటే మీ సేవా, ఈ సేవ, ఆన్‌లైన్‌ కేంద్రాల్లో కూడా రైతులు ఈ కేవైసీ ప్రక్రియను నమోదు చేసుకునే అవకాశం ఉంది. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నవారు www.pmkisan.gov.in వెబ్‌సైట్‌లోనూ ఈ కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయగానే ఈ–కేవైసీ అప్‌డేట్‌ వస్తుంది. దానిపై క్లిక్‌ చేసి ఆధార్‌ నంబర్‌ నమోదు చేయాలి.అప్పుడు ఆధార్‌ కార్డుకు లింకై ఉన్న సంబంధిత మొబైల్‌ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేయగానే గెట్‌ పీఎం కిసాన్‌ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్‌ క్లిక్‌ చేస్తే ఈ–కేవైసీ అప్‌డేట్‌ అవుతుంది జిల్లా వ్యవసాయ అధికారి భూక్య చత్రు నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ శోభన్ బాబు, ఏఈవోలు రవికుమార్, కరుణాకర్,సరిత,చరణ్,అవినాష్,రైతులు, సిహెచ్ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.