రైతులకు అండగా ఫసల్‌బీమా యోజన

సకాలంలో ఆదుకుంటున్న పథకం

బీమాపట్ల రైతుల్లో అవగాహనతో మార్పు

భూపాలపల్లి,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): మన దేశంలో అతివృష్టి, అనావృష్టి, ఆకాల వర్షాలు, కరవులతో తల్లడిల్లుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పధకం జయశంకర్‌ భుపాలపల్లి జిల్లా రైతాంగానికి వెన్నుదన్నగానిలుస్తుంది.. ప్రకృతి కరుణించక అనుకోని వైపరీత్యాలతో పంట నష్టపోతూ… ఇక వ్యవసాయం వద్దు అనుకునే రైతన్న కు వ్యవసాయం ముద్దు అనిపిస్తున్న ప్రధానమంత్రి ఫసల్‌ భీమ యోజనపై జయశంకర్‌ జిల్లానుండి అందిస్తున్న ప్రత్యేక కధనం. దేశానికి వెన్నుముక రైతు , రైతు పంటలు పండిస్తేనే ప్రజలకు ఐదు వెళ్ళు నోట్లోకి వేలుతాయి. అలాంటి రైతు తాము పండించిన పంటకు అకాల వర్షాల తోనో అనుకోని వైపరీత్యాలతో పంట నష్టపోతే అ రైతు పరిస్తితి ఏంటి అనుకునే తరుణంలో ఫసల్‌ బీమాయోజన వారికి ఆసరాగా నిలిచింది. పంట నష్ట పోయిన రైతన్న ను అమ్మలా అదుకుంటూతుంది. వ్యవసాయం దండుగ అని గతంలో అన్న రైతుకు వ్యవసాయం పండుగా అనేలా ప్రతి రైతు ప్రకృతి వైపరీత్యాలకు బెదరకుండా తమ భూమి ని సాగు చేసి వ్యవసాయాన్ని చేసే దైర్యాన్ని ఇస్తుంది.. ఫసల్‌ బీమా యోజన పధకం. రైతు తాము పండించే పంట పెట్టుబడి ఎకరాకు అందులో రెండు శాతం ఫసల్‌ బీమా పధకం ల ప్రీమియం కడితే చాలు వరిపంటకు ఎకరాకు 34 వేల బీమా ఉండగా అందులో రెండు శాతం అంటే 680 రూపాయలు ప్రీమియం కడితే చాలు అలగే మొక్క జొన్న … వేరుశనిగే పంటలకు రెండు శాతం ఉండగా పసుపు పంటకు మాత్రం 3.5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంది.. దీంతో రైతుకు ఎదురయ్యే ఇబ్బందులు తెగుళ్ళు .. వడగళ్ళు.. పిడుగులు.. అకాల వర్షాలతో పంట నష్టపోతే ఆ రైతుకు ఫసల్‌ బీమా రక్షణగా నిలుస్తుంది.. వీటితో పాటు ఇందులోనే వాతావరణ ఆధారిత పంటల బీమా పధకం ద్వారా పత్తి పంటతో పాటు మిర్చిపంటకు కూడా రైతు 5 శాతం ప్రీమియం చెల్లిస్తే వాతావరణం అనుకులించాకున్న వేసిన విత్తనం మొలకేత్తకపోయిన రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట పెట్టుబడి నష్టపోకుండా ఫసల్‌ బీమా పధకం అండగా నిలుస్తుంది. పంటకోత తర్వాత జరిగే నష్టాలకూ బీమా వర్తిస్తుంది. పంటనష్టం జరిగిందని తెలియగానే బీమా మొత్తంలో 25 శాతం మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. అంతేకాదు క్లెయిమ్‌ సెటిల్‌ కోసం పంట నష్టాన్ని అంచనా వేయటానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడతారు. స్మార్ట్‌ ఫోన్ల ద్వారా పంట కోత సమాచారాన్ని ఫొటోలు తీసి, అఎ/-లోడ్‌ చేస్తారు. గతంలో ఎన్నో పంట బీమా పధకాలు ఉన్న కూడా తాము అకాల వర్షాలతో నష్ట పోయేవాళ్ళమని… ఇప్పుడు ఫసల్‌ బీమాపై వ్యవసాయ అధికారులతో పాటు బ్యాంకు అధికారులు అవగాహన కల్పించడంతో తాము వ్యవసాయం అంటే కష్టం కాదని వ్యవసాయాన్ని ఇష్టంతో చేసుతున్నామని రైతులు తెలుపుతున్నారు.